తాగునీటి సరఫరాకు కొత్త పైపులైన్... తీరనున్న సమస్య - narsipatnam latest news
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలిక పరిధిలో తాగునీటి సమస్య తీరనుంది. నీటి సరఫరా కోసం నూతనంగా పైపులైను ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలిక పరిధిలో తాగునీటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. సుమారు కోటిన్నర రూపాయలతో పైపులైను పనులు ప్రారంభించారు. 70 వేలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో.. దానికి తగ్గట్టుగా నీటి సరఫరా అందట్లేదు. నూతనంగా పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. అబిద్ సెంటర్ నుంచి నూకాలమ్మ ఆలయ ప్రాంగణం మీదుగా పెద్ద బొడ్డేపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. సీబీఎన్ కాంపౌండ్ వద్ద ఉన్న నీటి పథకానికి అదనపు పైపులైను అమర్చే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే పురపాలక పరిధిలోని పలు ప్రాంతాల్లో పైపులైను లీకేజీ, నీటి సరఫరాలో అవాంతరాలు, ఇతర ఇబ్బందులు ఉండవని మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:గుంటూరులో ఆక్సిజన్ కంటైనర్ నిల్వ కేంద్రం