విశాఖలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఆంధ్రా క్రికెట్ సంఘం నూతన కార్యాలయం ఏర్పాటైంది. ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ స్టేడియం ఉన్న విశాఖ నుంచి కార్యకలాపాలు జరపడం క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని శరత్ చంద్రా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రా క్రికెట్ సంఘం నూతన కార్యాలయం ప్రారంభం - Dr. Y. S. Rajasekar Reddy International Cricket Stadium
ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి.. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ- వీడీసీఏ మైదానంలో ఆంధ్రా క్రికెట్ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు విజయవాడ నుంచి సాగిన ఏసీఏ కార్యకలాపాలు... ఇక నుంచి విశాఖ నుంచి సాగనున్నాయి.
విశాఖలో ఆంధ్ర క్రికెట్ సంఘం నూతన కార్యాలయం ప్రారంభం