ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి" - New government should focus on north andhra

"ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్​లో ఒక భాగమే" అనే అంశంపై విశాఖలో ఏపీయూడబ్లూజే, ఉత్తరాంధ్ర సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్రపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని మేథావులు కోరారు.

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి"

By

Published : Jul 18, 2019, 8:31 PM IST

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి"

విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో "ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్​లో ఒక భాగమే" అనే అంశంపై మేథావులతో సదస్సు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే, ఉత్తరాంధ్ర సాధన సమతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన వివిధ విశ్వవిద్యాలయల ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోటి మందితో ఎంతో సంస్కృతిని ఇనుమడించి ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. వలసల కొనసాగింపును నిరోధించాలంటే ఉత్తరాంధ్రకు నీళ్ళు అవసరమని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రగతిపై దృష్టి పెట్టాలని.. అలాగే ఇక్కడున్న వివిధ ప్రాజెక్టులు, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జీవో 371డీ మేరకు స్థానికులకు ఉద్యోగాలతోపాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి...విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details