ఆంధ్ర,ఒడిశా సరిహద్దు గ్రామాల్లో చాలావరకు ప్రాంతీయ భాషలే ఉంటాయి.కొన్ని గిరిజన భాషలకు లిపి ఉండదు.చిన్నతనం నుంచి ఆయా భాషలే నేర్చుకున్న గిరిపుత్రులకు తెలుగు పూర్తిగా తెలియదు.మిగతా ప్రాంతాలతో పోటీ పడలేక...తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు ఇక్కడి ప్రజలు.దీన్ని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ...వారి బాధ్యతను నేచర్ సంస్థ ఎంఈజీకు అప్పగించింది.
కొండ భాషలు మాట్లాడే కొన్ని గ్రామాలను నేచర్ సంస్థ దత్తత తీసుకుని...ప్రాంతీయ భాషలతో తెలుగును మిళితం చేసి ప్రత్యేకపాఠాలు,ప్రణాళికలు రూపొందించింది. 2009నుంచి70క్లస్టర్ పాఠశాలలో ఈ ప్రాజెక్టుని అమలు చేసి విజయం సాధించారు.ప్రస్తుతం20క్లస్టర్లలో ప్రాంతీయ భాషల్లో విద్యా విధానం కొనసాగుతోంది.పాఠశాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు,ఆట వస్తువులు అందజేసి పాఠాలు బోధిస్తున్నారు.