విశాఖ జిల్లా కొయ్యూరుకి మంజూరైన నూతన ఆధార్ నమోదు కేంద్రాన్ని.. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతాలకు చెందిన గిరిజనులు.. ఆధార్ అవసరాల కోసం ఇప్పటివరకు నర్సీపట్నం తదితర ప్రాంతాలకు ప్రయాసపడి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పడు ఆ బాధలు తీరాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
అరకు ఎంపీ చొరవతో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం - కొయ్యూరులో అరకు ఎంపీ చేతుల మీదుగా ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
ఆధార్ నమోదు అవసరాల కోసం గిరిజనులు పడుతున్న కష్టాన్ని చూసి.. విశాఖ జిల్లా అరకు ఎంపీ గొట్టేటి మాధవి స్పందించారు. ఓ నమోదు కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించారు. ఆమె అభ్యర్థన మేరకు మంజూరైన ఆధార్ కేంద్రాన్ని.. ఎంపీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.
ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన అరకు ఎంపీ మాధవి
మన్యంలోని గిరిజన ప్రాంతాల్లో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడం వల్ల గిరిజనులు అవస్థలు పడుతున్నారు. వారి ఇబ్బందులను ఎంపీ దృష్టిలో ఉంచుకొని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమె కోరక మేరకు ప్రజల సౌకర్యార్థం.. ఆధార్ కేంద్రం మంజూరైంది. దాని ప్రారంభోత్సవంలో ఆయా ప్రాంతాలకు చెందిన వైకాపా నాయకులు.. అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పారిశ్రామిక సమస్యలపై మంత్రి కన్నబాబు సమావేశం