లాక్డౌన్ నిర్వహణలో ఉపాధ్యాయులు తమకు సహకరించాలని విశాఖ జిల్లా ట్రైనీ డీఎస్పీ కిరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య చోడవరం మండల శాఖ అధ్వర్యంలో 32 పంచాయతీల్లో పనిచేస్తున్న 175 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఇదే సందర్బంలో తమతో కలిసి నడవాలని ఉపాధ్యాయులను డీఎస్పీ కోరగా.. వారు సమ్మతించారు.
పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ - @corona ap cases
విశాఖ జిల్లా చోడవరంలో పారిశుద్ధ్య కార్మికులకు ట్రైనీ డీఎస్పీ కిరణ్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నిర్వహణలో పోలీసులతో పాటు ఉపాధ్యాయులు తమ వంతు సాయం చేయాలని కిరణ్ కోరారు.
![పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ necessary goods distributes to sanitization workes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6801490-867-6801490-1586948959778.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాల పంపిణీ