విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి సమీపంలోని హెచ్.బి.కాలనీలో స్థలాన్ని అభివృద్ధి చేసి.. అందులో వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్మించి విక్రయిస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్.బి.సి.సి) అంచనా వేసింది. ఇక్కడి 22.19 ఎకరాల్ని విక్రయించడానికి ఎన్.బి.సి.సి.తో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థలాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా యథాతథంగా విక్రయించినా రూ.వెయ్యి కోట్లు వస్తాయని అంచనా. ఆ భూమిని లేఅవుట్‌గా అభివృద్ధి చేసి వేలంవేస్తే గజం రూ.2 లక్షల వరకు ధర పలికినా ఆశ్చర్యం లేదు. విశాఖ నగరానికి 10కి.మీ.లకు పైగా దూరం ఉండే మధురవాడలో వి.ఎం.ఆర్.డి.ఎ. అధికారులు నిర్వహించినవేలంలో గజం రూ.1.40 లక్షల చొప్పున గతంలో స్థలాన్ని కొందరు కొనుగోలు చేశారు. నగరం నడిబొడ్డులో ఉన్న హెచ్.బి.కాలనీలోని భూములను వేలం వేస్తే అంతకంటే భారీ మొత్తాలకు కొనుగోలు చేసే అవకాశముంది.
భూ విక్రయంతో రూ.వెయ్యి కోట్లు! - విశాఖ ఎన్బీసీసీ స్థలాల అమ్మకం
విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి సమీపంలోని హెచ్.బి.కాలనీలో స్థలాన్ని అభివృద్ధి చేసి.. అందులో వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్మించి విక్రయిస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్.బి.సి.సి) అంచనా వేసింది.
nbcc lands selling in vishakapatnam