అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని విశాఖ సముద్ర తీరంలో నిర్వహించారు. నావీ కార్యకలపాలు కొనసాగించే కోస్టల్ బ్యాటరీ తీర ప్రాంతం నుంచి భీమిలి వరకూ3వేల మంది నేవీ సిబ్బంది,అధికారులు,ఎన్ సీసీ క్యాడెట్లు తీరప్రాంతం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారని,తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు.తీర ప్రాంతాన్ని,సముద్రాలను కాపాడుకోవడం తమ భాద్యతని పేర్కొన్నారు.ప్రతీ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,భూమిని శుభ్రం చేసే దాని కంటే సముద్రాలను పరిశుభ్రం చేయడం చాలా కష్టం,ఖర్చుతో కూడుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
తీరంలోని వ్యర్థాలను తొలగించిన నావికాదళం - ncc cadets
అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా విశాఖ తీర ప్రాంతంలో తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించారు.
తీర ప్రాంత పరిశుభ్రత