నావికా దళాధిపతికి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు - chief
నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న సునీల్ లంబాకు తూర్పునౌకదళం వీడ్కోలు పలికింది. వివిధ నావికా విన్యాసాలతో లంబాకు గౌరవ వీడ్కోలు తెలిపారు.
భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లంబా ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా తూర్పు నౌకాదళ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. తూర్పు నౌకాదళం ప్రదర్శించిన విన్యాసాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, రియర్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ ఉన్నారు. సునీల్ లంబా నేవీ అధికార్లతో పలు అంశాలపై చర్చించారు. నేవీ సిబ్బంది భార్యామణుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలైన రీనా లంబా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవీ విరమణ వీడ్కోలు పర్యటన కోసం సునీల్ లంబా సతీసమేతంగా విశాఖ తూర్పు నౌకాదళంలో పర్యటిస్తున్నారు.