భారత నౌకాదళంలో మొట్టమొదటి శత్రు భయంకర నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌కు నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రం వద్ద ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుదూర్ సింగ్....సీనియర్ అధికార్ల సమక్షంలో ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేడెట్ డిఫెన్స్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఏకే జైన్ అంతర్జాలం ద్వారా వీక్షించారు.
శత్రు భయంకర నౌక 'ఐఎన్ఎస్ రాజ్‌పుత్'కు వీడ్కోలు
శత్రుభయంకర నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. విశాఖలోని తూర్పు నౌకదళ కేంద్రం వద్ద సీనియర్ అధికార్ల సమక్షంలో ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 41 ఏళ్ల పాటు సేవలందించిన ఈ నౌకను రష్యా సహకారంతో నిర్మించారు.
దాదాపు 41 ఏళ్ల పాటు సేవలందించిన ఈ నౌకను రష్యా సహకారంతో నిర్మించారు. 1980 మే 4న దీనిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. సుమారు 4 దశాబ్దాలుకు పైగా నౌకాదళంలో ఎన్నో కీలక ఆపరేషన్లలో ప్రముఖ పాత్ర పోషించింది. కెప్టెన్ గులాబ్ మోహన్‌లాల్ హిరానందనీ దీనికి తొలి కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సమర్థంగా సేవలందించింది. 1988 వరకూ పశ్చిమ కమాండ్ పరిధిలో ఉంది. ఆ తర్వాత తూర్పునౌకాదళానికి అనుసంధానం చేశారు. విపత్తుల సమయంలోనూ విశేష సహాయ కార్యక్రమాలకు దీనిని ఉపయోగించారు. ఈ నౌక మొత్తంగా 7 లక్షల 87 వేల 194 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది.
ఇదీ చదవండి: