విశాఖ జిల్లా అనకాపల్లిలో అదృశ్యమైన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మృతదేహాన్ని ఏలేరు కాలువలో పోలీసులు గుర్తించారు. అనకాపల్లి గ్రామీణ ఎస్సై ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన బుడతల వెంకట శ్రావణ్ అయ్యన్న కుమార్ భార్య సౌజన్య.. అనకాపల్లి మండలం గురజాడ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమెను.. కుమార్ శనివారం కారులో పాఠశాలలో దింపి తిరుగు పయనమయ్యారు. అప్పటినుంచి బుడగల శ్రావణ్ కుమార్ కనిపించకుండా పోయాడు.
నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మృతదేహం లభ్యం - విశాఖలో ఆదృశ్యమైన నావెల్ డాక్ యార్డ్ మృతదేహం
విశాఖ జిల్లా అనకాపల్లిలో అదృశ్యమైన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మృతదేహన్ని ఏలేరు కాలువలో పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో జారీ పడి తన భర్త మృతి చెందాడని సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు
నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మృతదేహం లభ్యం
బొజ్జన్నకొండ సమీపంలోని ఏలేరు కాలువ వద్ద కుమార్ కారు కనిపించగా.. అక్కడే కుమార్ దుస్తులు సైతం దొరికాయి. ఆదివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు కాలువలో గాలించగా రాయుడుపేటలోని ఏలేరు కాలువలో కుమార్ మృతదేహం లభ్యమైంది. కాలువలో జారీ పడి తన భర్త మృతి చెందాడని సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.