విశాఖ మన్యంలో ఏ కొండల్లో వెతికినా నాటుసారా దర్శనమిస్తోంది. తాజాగా పాడేరు మండలం వంటల మామిడి కొండల్లో స్థానిక యువకులు, గ్రామ వాలంటీర్లు కలిసి నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. భారీ ఎత్తున బెల్లం ఊటనిల్వలను పారబోశారు. విషయం తెలుసుకున్న ఇద్దరు నాటుసారా నిర్వహకులు మద్యం సేవించి... గ్రామంలో కత్తులతో హల్చల్ చేశారు. ప్రశ్నించిన గ్రామ సచివాలయ సిబ్బందిని నెట్టివేయటంతో ఒకరి చరవాణి పగిలిపోయింది. పాడేరు పోలీసులకు సమాచారం అందించగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మన్యంలో ఏరులై పారుతున్న నాటుసారా.. ధ్వంసం చేసిన యువకులు - మన్యంలో నాటుసారా బట్టీలు ధ్వంసం
పాడేరు మండలంలోని వంటలమామిడి కొండల్లో నాటు సారా బట్టీలను యువకులు, గ్రామ వాలంటీర్లు కలిసి ధ్వంసం చేశారు.
మన్యంలో నాటుసారా బట్టీలు ధ్వంసం