ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాణిజ్య విపణిలోకి మరో సహజ 'రెడ్ చిల్లి ఐస్ క్రీం' - విణిజ్య విపణిలోకి మరో సహజ 'రెడ్ చిల్లి ఐస్ క్రీం'

వాణిజ్య విపణిలోకి మరో సహజ ఐస్ క్రీమ్ అందుబాటులోకి వచ్చింది. 'రెడ్ చిల్లి ఐస్ క్రీం' పేరిట గెటాక్స్ నేచురల్ సంస్ధ ఈ ఉత్పత్తిని మార్కెట్​లోకి విడుదల చేసింది. బాలీవుడ్ నటి, మోడల్ అద్రిజా ఈ ఐస్ క్రీంను మార్కెట్​లో పరిచయం చేశారు.

natural red chilli ice creme launched
విణిజ్య విపణిలోకి మరో సహజ 'రెడ్ చిల్లి ఐస్ క్రీం'

By

Published : Dec 25, 2020, 10:38 PM IST

గెటాక్స్ నేచురల్ సంస్ధ సహజ 'రెడ్ చిల్లి ఐస్ క్రీం'ను మార్కెట్​లోకి విడుదల చేసింది. విశాఖలో బాలీవుడ్ నటి, మోడల్ అద్రిజా ఈ ఐస్ క్రీంను మార్కెట్​లో పరిచయం చేశారు.సహజ ఉత్పత్తిగా ఈ ఐస్ క్రీం ఎంతో మధురంగా ఉందన్నారు.

తమ సొంత డెయిరీల ద్వారా సేకరించిన ఉత్పత్తులతో తయారు చేసి మార్కెట్​లోకి విడుదల చేసిన ఐస్ క్రీంలు, మిల్క్ షేక్​లు పోషకాలతో వినియోగదార్లను ఆకట్టుకుంటున్నాయని ఆ సంస్ధ సీఈవో సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖతో పాటు కోస్తా జిల్లాల్లో మొత్తం 14 స్టోర్లు ఉన్నాయని.. వాటి సంఖ్య 50కి పెంచనున్నట్లు తెలిపారు. తమ ఉత్పత్తులను త్వరలో విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి:తెదేపా ఎమ్మెల్యే వెలగపూడికి వైకాపా ఎమ్మెల్యే సవాల్

ABOUT THE AUTHOR

...view details