ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శరభవరంలో ప్రకృతి వ్యవసాయ సామాజిక వనరుల కేంద్రం ప్రారంభం - సేంద్రీయ వ్యవసాయం తాజా వార్తలు

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నాన్ ఫార్మింగ్ అనే విధానం ద్వారా గ్రామాల్లో వ్యవసాయ పనులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Natural farming service center open in in sarabhavaram
వ్యవసాయ కేంద్రం

By

Published : Jul 14, 2020, 2:51 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరంలో ప్రకృతి వ్యవసాయ సామాజిక వనరుల కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. అన్ని వర్గాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని స్థానిక మహిళా రైతుల చేత నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎరువుల వాడకం, పురుగుల మందుల వాడకం తదితర రసాయన వినియోగంతో భూమిలో సారవంతం కోల్పోయే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

గ్రామాల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వనరులు, పశువుల మలమూత్రాలు, బెల్లపు పిండి, చెరువు మట్టి తదితర వనరులతో వ్యవసాయాన్ని పూర్తిగా కేంద్రీకరణ చేసి రైతులకు అవగాహన కల్పించే విధంగా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది నుంచి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న రైతులు… ఈ ఏడాది మరింత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details