సహజ ప్రకృతి అందాలు నీటిపై ప్రతిబింబాలుగా చూసేవారికి కనువిందు చేశాయి. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ఈ అద్భుత, అందమైన దృశ్యంతో సందర్శకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం జలాశయంలో నీరు నిండుకుండలా ఉండడంతో అవతల వైపున్న కొండవాలు ప్రకృతి అందాలు జలాశయం నీటిపై రెండుగా కనిపిస్తున్నాయి. ఈ అందాలను సందర్శకులు, ప్రకృతి ప్రేమికులు కనులారా తిలకించి ఆహ్లాదం పొందుతున్నారు.
ప్రకృతి అందాలు-ప్రాజెక్టు నీటిలో కనువిందు - Natural beauty- found in project water
ప్రకృతిలో ఎన్నో సహజసిద్ధ అందాలు కొలువై ఉన్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూసినపుడు కంటికి, మనసుకి ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. ఇలాంటి ప్రకృతి సహజసిద్ధ అందాలే నిండు కుండలా ఉన్న రైవాడ జలాశయం నీటిలో ప్రతిబింబించాయి.
ప్రకృతి అందాలు-ప్రాజెక్టు నీటిలో కనువిందు