విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం మెట్టపాలెం శివారు మొండికండి సమీపంలోని ఓ జీడితోటలో నిల్వ చేసిన రెండువేల లీటర్ల బెల్లం ఊటను నర్సీపట్నం గ్రామీణ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు జీడితోటలను గాలించారు.
ఒక తోటలో ఎవరికీ అనుమానం రాకుండా తాటాకులు వేసి వాటి కింద భూమిలో ప్లాస్టిక్ కవర్లలో బెల్లం పులుపు నింపి దాచారు. భూ యజమాని జీడితోటను వేరే వాళ్లకు కౌలుకు ఇచ్చారు. కౌలు పొందిన వారికి తెలిసే జరుగుతోందా, లేదా అన్నది విచారణలో తేలనుందని ఎస్సై రమేష్ పేర్కొన్నారు.