దేశంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ తన వార్షిక స్కాలర్ షిప్ పరీక్ష 'ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్' 10వ ఎడిషన్ ను విశాఖలో ప్రకటించింది. డాక్టర్స్, ఐఐటిషియన్స్ కావాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షను అక్టోబర్ 20న దేశంలోని 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో అర్హులైన విద్యార్థులకు 100 శాతం దాకా స్కాలర్ షిప్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకున్న విద్యార్థులు అర్హులుగా వారు నిర్ణయించారు. అక్టోబర్15 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది.
అక్టోబర్ 20న 'ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్' - visakha
దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ పరీక్షను నిర్వహించనున్నట్టు నిర్వహకులు తెలిపారు.
స్కాలర్ షిప్