ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబరులో విశాఖపట్నంలో జాతీయ లోక్‌అదాలత్‌ - national lok adalath news

విశాఖపట్నంలో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

national lok adalath
జిల్లా కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌

By

Published : Nov 12, 2020, 3:02 PM IST

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబరు 12వ తేదీన లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ ఎ.హరిహరనాథ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో లోక్​అదాలత్​ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్న, రాజీకి అర్హత కలిగిన, సివిల్‌, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి కక్షిదారులు లోక్‌అదాలత్‌ను సంప్రదించాలని చెప్పారు. వివరాలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌లో సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి: జంతు ప్రదర్శనశాలల్లో కల్పించాల్సిన వసతుల పై సర్వే

ABOUT THE AUTHOR

...view details