ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని మానుకోవాలి' - protest of vizag steel plant privatization

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంఘాలకు మద్దతు పెరుగుతోంది. జీవీఎంసీ వద్ద నిరసనదీక్ష చేస్తున్న కార్మిక, కర్షక సంఘాల నాయకులకు జాతీయ రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు.

national farmers leaders rakesh tikaiath
జాతీయ రైతు నాయకులు రాకేష్ సింగ్ టికాయత్

By

Published : Apr 18, 2021, 4:00 PM IST

జాతీయ రైతు నాయకులు రాకేష్ సింగ్ టికాయత్

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక అఖిలపక్షం చేస్తున్న దీక్షాశిబిరాన్ని జాతీయ రైతు సంఘ నాయకులు సందర్శించారు. జాతీయ రైతు నాయకులు రాకేష్ సింగ్ టికాయత్, అశోక్ ధావలే, బీ.వెంకట్, బల్​కరన్​సింగ్​లు కార్మిక సంఘ దీక్షకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని మానుకోవాలని జాతీయ రైతు సంఘం నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details