దేశంలో కేంద్రం సహాయంతో అమలవుతున్న అంగన్వాడీ వ్యవస్ధ మంచి ఫలితాలను ఇస్తోందని, అందరూ అంకితభావంతో పని చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని జాతీయ బాలల కమిషన్ సభ్యురాలు రోసి తాబా అన్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె.. నగరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
'అంగన్వాడీ వ్యవస్ధ మంచి ఫలితాలిస్తోంది' - విశాఖ జిల్లా వార్తలు
కేంద్రం సహాయంతో అమలవుతున్న అంగన్వాడీ వ్యవస్ధ మంచి ఫలితాలను ఇస్తోందని జాతీయ బాలల కమిషన్ సభ్యురాలు రోసి తాబా అన్నారు. విశాఖ జిల్లా లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల తీరును పరిశీలించారు.
పౌష్టికాహార మాసోత్సవం జరుగుతున్న సందర్భంగా పిల్లలో పౌష్టికాహార లేమి లేకుండా చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలతోపాటుగా, వాటిని అందించే పనులను పరిశీలించారు. తక్కువ బరువు ఉన్న బాలలను గుర్తించి వారి ఎదుగుదలకు అవసరమైన వాటిని అంగన్వాడీల ద్వారా ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని కేంద్రాలలోనూ బాలలకు ఈ తరహా లోపాలను సరిదిద్దే చర్యలు అమలు చేస్తున్నామని మహిళా శిశుసంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు చిన్మయాదేవి అన్నారు. శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు భావితరాలకు వారసులుగా వారిని తీర్చిదిద్దడంలో అంగన్వాడీలలో సహాయకురాలు దగ్గర నుంచి డైరక్టర్ వరకు కృషి చేస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండి:కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం నడుస్తోంది: ఎంపీ జీవీఎల్