ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మాకవరపాలెం మండలంలోని తామరం, చంద్రయ్యపాలెం గ్రామాల్లో పర్యటిస్తూ...వైకాపా నవరత్నాలను వివరించారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అనుచరులు ఉమాశంకర్‌కు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉమాశంకర్ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...