విశాఖ జిల్లా రోలుగుంట మండలం వెంకటాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సీపట్నం 8వ వార్డు వాలంటీర్ మాడుగుల దేవయ్య మృతి చెందాడు. విధులలో భాగంగా ద్విచక్రవాహనంపై కొత్తకోట వెళ్తుండగా అడ్డం వచ్చిన గేదెను ఢీకొన్నాడు. తలకు బలమైన గాయమైంది. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయిన్నట్లు స్థానికులు తెలిపారు. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వాలంటీర్ మృతి - విశాఖ జిల్లా
రోడ్డు ప్రమాదంలో వాలంటీర్ మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం వెంకటాయపాలెంలో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వాలంటీర్ మృతి