విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య రోలుగుంట మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.. మండల కేంద్రం రోలుగుంట, శరభవరం, బుచ్చింపేట గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటన చేసిన సబ్ కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం కార్డుల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ కార్డులను సకాలంలో జారీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్డుల జారీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామ వాలంటీర్లు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
గ్రామాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన - గ్రామాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన న్యూస్
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే..సస్పెండ్ చేస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య హెచ్చరించారు. రోలుగుంట మండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించిన మౌర్య బియ్యం కార్డుల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన