విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తోటిపాలలోని రావు ఖాతా భూములను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. స్థానికంగా ఉన్న సర్వే నెంబరు 210లో గల 76 ఎకరాల 55 సెంట్ల భూమి వివాదస్పదంగా మారింది. కొంతమంది నాయకులు ఈ భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని దళిత రైతులు ఫిర్యాదు చేశారు . విచారణ చేపట్టిన సబ్ కలెక్టర్.. భూముల వివరాలపై ఆరా తీశారు. త్వరలోనే రైతులతో సమావేశమై వివాద భూములకు సంబంధించి పూర్తి వివరాల సేకరిస్తామని చెప్పారు. అనంతరం అవసరమైన విచారణ చేపట్టి నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు.
రావు ఖాతా భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్
విశాఖలోని రావు ఖాతా భూములపై వివాదం చెలరేగుతోంది. కొంతమంది నాయకులు ఈ భూములను స్వాధీనం చేసుకొవటానికి ప్రయత్నిస్తున్నారని... దళిత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు.
రావు ఖాతా భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్ నారపరెడ్డి