ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాటి లోపాలు పునరావృతం కాకుండా చూడాలి' - lands re survey in narsipatnam news

భూముల రీసర్వే ప్రక్రియపై వివిధ అధికారులతో... విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సమావేశమయ్యారు. గతంలో జరిగిన లోపాలు మళ్లీ జరగకుండా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

lands re survey
నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య

By

Published : Apr 20, 2021, 10:29 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని భూముల రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా జరగాలని... సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య స్పష్టం చేశారు. భూముల రీ సర్వే ప్రక్రియపై సర్వేయర్లు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు ఇతర అధికారులతో సబ్ కలెక్టర్ సమావేశమయ్యారు.

గతంలో జరిగిన లోపాల కారణంగానే.. ప్రస్తుతం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. మళ్లీ అటువంటి లోపాలు పునరావృతం కాకూడదనీ.. రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సబ్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details