రెడ్‌జోన్‌గా ప్రకటించిన విశాఖ జిల్లా నర్సీపట్నంలో వచ్చే నెల 4 వరకు లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలు జరుపుతామని ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి వెల్లడించారు. నర్సీపట్నంలో ఈనెల ఆరో తేదీన రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సుమారు మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బాధితులిద్దరూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆర్డీఓ తెలిపారు. భవిష్యత్తులో కరోనా కేసులు నమోదు కాకుండా ఉంటే వచ్చే నెల 4వ తేదీ నుంచి రెడ్ జోన్లో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి డివిజన్లో బియ్యంతో పాటు శనగలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆర్డీవో తెలిపారు.
'వచ్చే నెల 4వరకు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తాం' - నర్సీపట్నంలో లాక్డౌన్ నిబంధనలపై స్పందించిన ఆర్డీఓ
రెడ్‌జోన్ ప్రాంతమైన నర్సీపట్నంలో వచ్చే నెల 4 వరకు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తామని ఆర్డీఓ తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నర్సీపట్నంలో లాక్డౌన్ నిబంధనలపై స్పందించిన ఆర్డీఓ