విశాఖ జిల్లా నర్సీపట్నంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగింది. సుమారు కోటి రూపాయల వ్యయంతో రెండేళ్ల క్రితమే నిర్మించిన ఈ స్టేషన్ ఎన్నికల కోడ్ , ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రారంభానికి నోచుకోలేదు.
నూతన భవనంలోకి మారిన నర్సీపట్నం పోలీసు స్టేషన్ - vishaka updates
నర్సీపట్నంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనంలోకి మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవం జరగలేదు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు లాంఛనంగా కార్యక్రమం జరిగింది.
![నూతన భవనంలోకి మారిన నర్సీపట్నం పోలీసు స్టేషన్ newly constructed police station building](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9556913-556-9556913-1605511071711.jpg)
నర్సీపట్నం నూతన పోలీసు భవనంస్టేషన్
వాటిని అధిగమించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయినప్పటికీ శుభ ఘడియలు కోసం నిరీక్షించిన స్టేషన్ సిబ్బంది... ఈ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు భవనంలోకి ప్రవేశించారు. ఇకపై స్టేషన్ కు సంబంధించి కార్యకలాపాలన్ని కొత్త భవనం నుంచి నిర్వహిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ...కార్తిక మాసంలో పూజలు... జన్మ జన్మలకు పుణ్యం