ఈనెల 20,21 తేదీలలో విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో చదువుతున్న కృష్ణవేణి బంగారు పతకం కైవసం చేసుకుంది. 9వ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో బంగారు పతక గెలవటంతో.. జాతీయ స్థాయి పోటీలకు ఆమె అర్హత సాధించింది.
విజేతగా నిలిచిన కృష్ణవేణిని కళాశాల ప్రిన్సిపల్ కామేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే సహ విద్యార్థులు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కృష్ణవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు.