గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. కొయ్యూరు, మంప, కేడీపేట పోలీస్ స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ గ్రామాల్లో గంజాయి, సారా విక్రయాలు వంటివి జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. నిరంతరంగా అప్రమత్తంగా ఉంటూ మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని ఎఎస్పీ సూచించారు. మావోయిస్టుల కదలికలు, గాలింపు చర్యలు, వారపు సంతలపై నిఘా తదితర అంశాలపై సీఐ, ఎస్ఐలకు సూచనలు అందజేశారు. అనంతరం అల్లూరి పార్కును సందర్శించి అల్లూరి సీతా రామరాజు, గంటందొరల సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ల భద్రతను పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. అలాగే సిబ్బంది నివాస గృహాలు పరిశీలించి, అదనంగా చేపట్టాల్సిన వసతులపై ఆరా తీశారు.
'మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా' - నర్సీపట్నం వార్తలు
మావోయిస్టుల కదలికలు, గాలింపు చర్యలు, వారపు సంతలపై నిఘా పెట్టినట్లు.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు.గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.
'మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా'