ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సమగ్ర నివేదికను సకాలంలో అందించాలి' - vizag latest news

ఆర్​ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై అధికారులతో నర్సీపట్నం సబ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

narseepatnam sub collector orders on ROFR documents distributions
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

By

Published : Mar 24, 2021, 6:28 PM IST

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సకాలంలో సమర్పించాలని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. నర్సీపట్నం డివిజన్​కు సంబంధించి తహసీల్దార్, అటవీ అధికారులు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడారు.

ఈ సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరయ్యారు. అధికారుల పనితీరుపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, రికార్డులను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details