ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్ - narseepatnam

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

narseepatnam sub collector gives orders to officers about rains
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

By

Published : Oct 12, 2020, 4:25 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సూచించారు. నర్సీపట్నం సబ్​ కలెక్టర్ కార్యాలయంలో దూర దృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన... అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని డివిజన్లలోని తహశీల్దార్​లను ఆదేశించారు. మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, తద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details