ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ పై రాజకీయం చేసి లబ్ది పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రణాళిక చేస్తున్నారని... ఈ ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. కరోనా పై వాస్తవాలను దాయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఈ విషయాన్ని తెదేపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఆంగ్ల మాధ్యమం జీవోపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దృష్టిలో ఉంచుకొని సంబరాలు చేసుకోవడం తెలుగుదేశం నేతలకు తగదని వ్యాఖ్యానించారు.
కరోనాను రాజకీయం చేయాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే గణేష్ - కరోనా వైరస్
కరోనాను రాజకీయం చేసి తెదేపా నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.
![కరోనాను రాజకీయం చేయాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే గణేష్ narisipatnam MLA uma shankar ganesh PRESS MEET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6841319-417-6841319-1587203050080.jpg)
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్