విశాఖ జిల్లా నర్సీపట్నం నూతన సబ్ కలెక్టర్‌గా నారాయణరెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెుదటి నుంచి పాడేరు అరకు ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజలకు సేవలు అందించాలనే కోరిక ఉండేదనీ... అందుకు తగ్గట్టుగానే విశాఖ మన్యం ముఖద్వారంగా పిలిచే నర్సీపట్నంలో సబ్ కలెక్టర్‌గా నియామకం కావటం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలతో పాటు డివిజన్ సమస్యలపైనా దృష్టి సారించి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. సబ్ కలెక్టర్‌గా బాధ్యతులు చేపట్టిన నారాయణరెడ్డి మౌర్యకు కార్యాలయ సిబ్బంది, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా నారాయణరెడ్డి మౌర్య - నర్సీపట్నం సబ్ కలెక్టర్ వార్తలు
నర్సీపట్నం నూతన సబ్‌కలెక్టర్‌గా నారాయణరెడ్డి మౌర్య బాధ్యతలు చేపట్టారు. విశాఖ మన్యం ముఖ ద్వారంగా పిలిచే నర్సీపట్నంలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతులు చేపట్టటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మౌర్య అన్నారు.
నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా నారాయణరెడ్డి మౌర్య