విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఘనంగా జయంతోత్సవం నిర్వహించారు. నరసింహస్వామి జయంతి సందర్భంగా పండితులు వేద పఠనం చేశారు. అనంతరం ఆలయం చుట్టూ తిరువీధి జరిపారు. స్వామివారిని కల్యాణ మండపంలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఈ ఉత్సవానికి భక్తులు ఎవరినీ అనుమతించ లేదు.
సింహగిరిపై వైభవంగా నరసింహస్వామి జయంతి వేడుకలు - today Narasimhaswamy Jayanti news update
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఘనంగా జయంతోత్సవం నిర్వహించారు. నరసింహస్వామి జయంతి సందర్భంగా పండితులు వేద పఠనం చేశారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రెండో విడత చందన సమర్పణం జరపనున్నారు.
వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రెండో విడత చందన సమర్పణం జరపనున్నారు. ప్రతి పౌర్ణమికి భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొవిడ్ కారణంగా రేపు భక్తులకు సింహగిరిపై దర్శనాలకు అనుమతి ఇవ్వలేదు. గురువారం ఉదయం 6:30 గంటలకు భక్తులకు దర్శనాలు లభిస్తాయని ఆలయ ఈవో తెలిపారు. చందన సమర్పణ సందర్భంగా ఐదు రోజుల పాటు అరగదీసిన చందనంలో సుగంధద్రవ్యాలు మిళితం చేసి సమర్పణకు సిద్ధం చేశారు. గురువారం ఉదయం చందన సమర్పణ జరపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...