Nara Lokesh Yuvagalam Padayatra In Vizag:తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కోలహలంగా సాగుతోంది. 224వ రోజు ప్రారంభమైన పాదయాత్రలో, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో లోకేశ్ భేటీ అయ్యారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని, నారా లోకేశ్ మండిపడ్డారు. బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారు, యువనేతను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు.3నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం: బీసీలపై జగన్ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టిందని లోకేశ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో గంజాయి సాగు జోరుగా సాగుతోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల బెల్లంపై ఆంక్షలు తెనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని లోకేశ్ ఆరోపించారు. గంగాదేవిపేట రైతులు లోకేశ్‌ను కలిసి శారద కాల్వ పూడికపై వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి రాగానే శారద కాల్వ పూడిక తీయిస్తామని, కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు లోకేశ్ తెలిపారు.
లోటు బడ్జెట్లోనూ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం - బీసీ ఉపకులాల అభ్యున్నతికి చర్యలు : లోకేశ్