తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావు దీక్షకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు ఆమరణ నిరహార దీక్ష చేయనున్నట్లు పల్లా శ్రీనివాసరావు గతంలోనే స్పష్టం చేశారు.
రేపు విశాఖకు లోకేశ్.. తెదేపా నేతల దీక్షకు సంఘీభావం - విశాఖలో తెదేపా నేతల నిరసనకు నారా లోకేశ్ సంఘీభావం తాజా వార్తలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరాహార దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం తెలపనున్నారు. ఇందుకు రేపు లోకేశ్ విశాఖ చేరుకోనున్నారు.

రేపు విశాఖకు నారా లోకేశ్