Nara Lokesh Tweet on YSRCP Government : వైఎస్సాస్సీపీ ప్రభత్వంపై ట్విటర్(X) వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శల వర్షం కురిపించారు. పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంగా మారారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాజధాని చేస్తామని విశాఖ నగరాన్ని నేరాలు-ఘోరాలకు అడ్డా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు. సీఎం ఇంటి పక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటి వరకూ నిందితుడ్ని పట్టుకోలేదని దుయ్యబట్టారు.
అఘాయిత్యాలకు క్యాపిటల్: తెలుగుదేశం పాలనలో ఆర్థిక రాజధానిగా విశాఖను ప్రమోట్ చేశామని నారా లోకేశ్ గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ విశాఖను అఘాయిత్యాలకు క్యాపిటల్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస పాలనలో రక్షణ లేని బాలికలు, మహిళలకు కుటుంబ సభ్యుడిగా తనదో ఓ వినతి అని, మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేరగాళ్ల రాజ్యం అంతం అవుతుందని, ప్రజా ప్రభుత్వం వస్తుందని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ బాలికల, మహిళల రక్షణ బాధ్యత తీసుకుంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వంలో మహిళలను వేటాడే నేరస్తులకు మాత్రమే సాధికారత : చంద్రబాబు
Nara Lokesh Fire on YSRCP MLA Biyyapu Madhusudhan Reddy :వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపమని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారని అన్నారు.