ఎస్సీలపై సీఎం జగన్ దమనకాండ కొనసాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష దారుణమన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి మహేష్‌పై ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు దిగడం జగన్ రెడ్డి ఎస్సీ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష దారుణం: నారా లోకేశ్
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి మహేష్‌పై ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని నారా లోకేశ్ అన్నారు. ఉన్నత స్థానంలో ఉండాల్సిన వ్యక్తి యూనివర్సిటీ గేట్ దగ్గర న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు.
40 రోజులుగా పీహెచ్డీ ఫైల్ ఆపి మహేష్‌ని వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఉన్నత చదువు అభ్యసించి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన ఎస్సీ బిడ్డ నడిరోడ్డుపై యూనివర్సిటీ గేట్ దగ్గర న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 30 గంటలు దాటినా స్పందించకుండా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఆరేటి మహేష్‌కి తక్షణమే న్యాయం చెయ్యాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదు