ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ప్రభావం... ఆన్​లైన్​లో నామకరణం..!

కరోనా మహమ్మారి ప్రభావంతో చాలా వేడుకలు రద్దయ్యాయి. మరికొన్ని వాయిదా పడ్డాయి. కొందరైతే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయ జంట తమ కుమారుడికి ఆన్​లైన్​లో నామకరణ కార్యక్రమం జరిపారు. విశాఖ జిల్లా చోడవరంలోని ఓ బ్రాహ్మణుడు లాప్​టాప్ ముందు కూర్చుని నామకరణం చేశారు.

naming ceremony held through online in vishka district
naming ceremony held through online in vishka district

By

Published : Jun 14, 2020, 6:03 PM IST

కరోనా ప్రభావంతో తమ కుమారుడికి ఆన్​లైన్ ద్వారా నామకరణ వేడుక జరిపింది ఓ జంట. లాప్​టాప్ సాయంతో కార్యక్రమాన్ని వినూత్నంగా జరిపించారు. భారత్​కు చెందిన ఆదిత్య, రమ్య భార్యభర్తలు. వీరు ప్రస్తుతం చికాగోలోని నెబ్రాస్కాలో నివాసముంటున్నారు. తమ అయిదు నెలల బాబుకు నామకరణం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముహుర్తం కూడా నిర్ణయించారు.

అయితే అమెరికాలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండటంతో నామకరణ కార్యక్రమం నిర్వహణకు అక్కడ ఉండే ప్రవాస బ్రాహ్మణులు నిరాకరించారు. విశాఖ జిల్లా చోడవరంలో ఉంటున్న తన తండ్రి పసుమర్తి శేష కామయ్య గుప్తకు రమ్య విషయం చెప్పింది. స్థానిక బ్రాహ్మణుడు ప్రసాదును నామకరణ కార్యక్రమం నిర్వహణకు ఒప్పించాడు కామయ్య గుప్త.

ప్రసాద్ లాప్​టాప్​ ముందు కూర్చొని మంత్రాలు చదవగా... నెబ్రాస్కాలోని ఆదిత్య- రమ్య దంపతులు ఆయన చెప్పినట్లు పుజా కార్యక్రమం నిర్వహించారు. తమ అయిదు నెలల బాబుకు శౌర్య సాయి గుప్త అని నామకరణం చేశారు. అనుకున్న సమయానికి శుభకార్యం జరగటంతో వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 294 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details