విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 13 జంటలు పాల్గొన్నాయి. ప్రతి నెలలో ఒకరోజు మాత్రమే జరిగే ఈ హోమం స్వామివారి నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం రోజున నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే భక్తులు రూ. 2500 చెల్లించాలి. కరోనా అనంతరం నిర్వహిస్తున్న ప్రత్యక్ష హోమానికి భక్తులు అధికంగా హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పూజలు చేశారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం - సింహాద్రి అప్పన్న ఆలయం వార్తలు
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమంలో పాల్గొన్నారు.
సింహాద్రి అప్పన్న ఆలయం