విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పోలీస్స్టేషన్లో మావోయిస్టు పార్టీకి చెందిన బోనంగి నాగేశ్వరరావు(34), గడుతూరి రామచంద్ర పడాల్ (35), సింద్రి అప్పారావు(31)ను అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్కు తరలించామని చింతపల్లి, పాడేరు సీఐలు శ్రీను, పైడపు నాయుడు తెలిపారు. ఎవరైనా స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయమని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని సీఐలు శ్రీను, పైడపునాయుడు తెలిపారు.
విశాఖలో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్ - naksalites news in visakha dst
విశాఖ ఏజెన్సీలో పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. పలు కేసుల్లో వీరు ప్రధాన నిందితులని సీఐ శ్రీను తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులపై ఎటువంటి కేసులు నమోదు చేయమని వెల్లడించారు.
naksalites arrested in visakha agency