విశాఖ పాత గాజువాక జంక్షన్లో నాయి బ్రాహ్మణ సంఘం నిరసన చేపట్టింది. కామాంధుడికి బలైన కడప జిల్లా బద్వేల్‌కు చెందిన గొడుగు నూరు శిరీష కుటుంబాన్ని ఆదుకోవాలని కోరింది. నిందితుడు చరణ్‌ను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నాయిబ్రాహ్మణ సంఘంతో పాటు.. ఏపీ బీసీ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు.
శిరీష హత్య కేసుపై నాయి బ్రాహ్మణ సంఘం నిరసన - Nai Brahmin community protest on sirisha death case in vishaka
కామాంధుల చేతుల్లో హత్యకు గురైన గొడుగునూరు శిరీష కుటుంబాన్ని ఆదుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం కోరింది. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్లో నిరసన చేపట్టారు.
నాయి బ్రాహ్మణ సంఘం