ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాకు ఆసక్తి లేదు.. పవన్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు: నాగబాబు - నాగబాబు తాజా వార్తలు

Nagababu: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పవన్‌ పోటీ చేయవచ్చునని జనసేన నేత నాగబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి లేదన్న ఆయన.. పొత్తులపై పవన్‌ నిర్ణయం తీసుకుంటారుని చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు.

నాగబాబు
నాగబాబు

By

Published : Jun 3, 2022, 6:27 PM IST

Janasena Leader: ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పవన్ పోటీ చేయవచ్చునని తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయరని.. కానీ ప్రభావంతమైన కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని.. తాను పార్టీ సేవలకే పరిమితమని చెప్పారు.

వైకాపా నేతలు విశాఖ రుషికొండను మాయం చేయాలని చూస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఎక్కడ ఏ కొండలు తవ్వేద్దామా ? అనే ధోరణితో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. చాలా చిన్న విషయాలకు జనసైనికులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలంగా ఉందన్న నాగబాబు.. త్వరలోనే బూత్ కమిటీలు వేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

నాకు ఆసక్తి లేదు.. పవన్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details