ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో 'నాడు -నేడు' పనులు - paderu Gurukul School news

కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలు మూసివేశారు. ఆంక్షలతో ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభించారు. ఇప్పటికే తరగతుల నిర్వహణ లేటయ్యింది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి...వారితో 'నాడు -నేడు' పనులు చేయిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

'Nadu-Nedu' works with students
విద్యార్థులతో 'నాడు -నేడు' పనులు

By

Published : Jan 11, 2021, 7:54 PM IST

విశాఖ జిల్లా పాడేరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల పునః ప్రారంభమైనప్పటి నుంచి నాడు నేడు పనులు చేయిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పండుగ సెలవులకు వెళ్లే వారిని కూడా ఈరోజు పనులు చేయించారని.. మధ్యాహ్నం వరకు పిల్లలు పనిలోనే ఉన్నారన్నారు. పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ పనులు అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రతిరోజు రాళ్లు మోయటం, ఇసుక పని, ఇతర భవన నిర్మాణ పనులను తమ పిల్లలతో చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

పాడేరు గురుకుల పాఠశాలలో పనులు చేస్తున్న విద్యార్థులు

"కొవిడ్​ కారణంగా ఇప్పటికే పిల్లలు చదువును కోల్పోయారు. ఇక్కడ వారితో పనులు చేయిస్తున్నారు. చదువు చెప్పాలి కానీ..పనులు చేయించటం తప్పు" -ఓ విద్యార్థిని తండ్రి

"నాడు నేడు పనుల వల్ల మా చదువులకు ఆటంకం కలుగుతుంది. మేము పదోతరగతి కావటంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. కానీ పనుల వల్ల ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా రోజులు ఇంట్లోనే గడిచిపోయింది" -విద్యార్థిని

"పండుగ సెలవులు ఇవ్వగానే ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా విద్యార్థులకు రాళ్ల మోసే పని పెట్టారు. పాఠశాలకు చదువుకునేందుకు వచ్చారు కానీ పనులు చేసేందుకు కాదు. ఈ విధంగా పిల్లలతో పని చేయించటం సరైంది కాదు"-విద్యార్థిని తల్లి

ఇదీ చదవండి: సీఎం జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details