విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధికి రూ.4.44 కోట్లు నిధులు విడుదలయ్యాయి. నాబార్డు కింద ఈ నిధులు మంజురయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. త్వరలోనే పాఠశాలలలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం రూ.1.60 కోట్లు, పి.ఎస్.పేట ఉన్నత పాఠశాలను రూ.1.08 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. రావికమతం ఉన్నత పాఠశాలకు రూ.45.20 లక్షలు, రోలుగుంట ఉన్నత పాఠశాలకు రూ.84.90 లక్షలు, బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి ఉన్నత పాఠశాలకు రూ. 46.50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు - mla karanam dharma sri latest news update
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో పలు పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు విడుదల చేసింది. ఈమేరకు మంజురైన నిధులు వివరాలను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెల్లడించారు.
పలు పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు