ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రత్యేక హోదా సాధనకు రాజీనామాకు సిద్ధం" - YCP MP

విశాఖ మహానగర అభివృద్ధికి కృషి చేస్తానని విశాఖ పార్లమెంటు విజేత ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా సాధనకు అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

వైకాపా నేత ఎం.వి.వి సత్యనారాయణ

By

Published : May 29, 2019, 3:03 PM IST

Updated : May 29, 2019, 3:52 PM IST

వైకాపా నేత ఎం.వి.వి సత్యనారాయణ

విశాఖ నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. విశాఖ నగరానికి మెట్రో వచ్చేలా కృషి చేసి... రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తానని చెప్పారు. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ... విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలో నీటి సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామని చెప్పారు. అందుకోసం అమసరమైతే... రాజీనామాకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.

Last Updated : May 29, 2019, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details