విశాఖ మన్యంలోని పాడేరులో పౌరసత్వం సవరణ చట్టం ఎన్ఆర్సీ, క్యాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ ముస్లింలు, వామపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. భాజపాకు, మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు ఎంపీడిఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలతోపాటు ముస్లిం మహిళలు భారీగా పాల్గొన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేకంగా పాడేరులో భారీ ర్యాలీ - Muslims in opposition to NRC and Cab laws news
పౌరసత్వం సవరణ చట్టం ఎన్ఆర్సీ, క్యాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యం పాడేరులో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. భాజాపాకు, మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్ఆర్సీ, క్యాబ్‌లకు వ్యతిరేకంగా పాడేరులో భారీ ర్యాలీ