విశాఖలో ముస్లిం సంఘాల ఆందోళన - విశాఖలో ముస్లిం సంఘాల ధర్నా
ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టాయి. ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలనే...భాజపా ప్రభుత్వం ఇలాంటి బిల్లులను ప్రవేశపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ముస్లింలు సఖ్యతతో మెలుగుతున్న మనదేశంలో ఇలాంటి బిల్లులు అవసరమా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నా... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బిల్లులను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ధర్నా చేస్తున్న ముస్లిం సంఘాలు