విశాఖ జిల్లా గొలుగొండ మండల పరిధిలో.. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొంత కాలంగా అతను ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపించాడు. చివరికి ఆ మహిళ కుమారుడి చేతిలోనే హతమయ్యాడు. మృతుడిని గిరిబాబు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడుపూడి గ్రామంలో పూల వ్యాపారం చేసిన గిరిబాబు.. అదే గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. అప్పటికే లక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మి గురించి ఇరుగుపొరుగు చేసే వ్యాఖ్యలతో ఆమె కుమారులు మనస్థాపానికి గురయ్యారు. తమ ఇంటికి రావద్దని గిరిబాబుతో ఇటీవల లక్ష్మి రెండో కుమారుడు రాజబాబు గొడవపడ్డాడు.