విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో ఈ నెల 19వ తారీఖున అర్ధరాత్రి దారణ హత్యకు గురైన అప్పలనరసమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. విశాఖకు చెందిన గుడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తే అప్పలనరసమ్మను హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. అప్పలనరసమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో హత్య జరగ్గా.. రెండు రోజుల తరువాత విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు. గుడ్ల సుధాకర్‌ను పట్టుకున్నట్టు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ, వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న అప్పలనరసమ్మ వద్దకు ఈ నెల 19వ తారీఖున సుధాకర్ రాత్రి 9 గంటలకు వెళ్లాడని తెలిపారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలను దొంగిలించాడని వెల్లడించారు. సుధాకర్‌కు ఉన్న అప్పులు బంగారు ఆభరణాలు అమ్మి తీర్చవచ్చుననే ఉద్దేశంతో హత్య చేసినట్లు ఆయన వివరించారు. నిందితుడిను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1 వేల 500 రూపాయల నగదు, 3 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని, సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.
ఒంటరి మహిళ హత్య.. కేసును ఛేదించిన పోలీసులు - latest crime news in vizag
విశాఖపట్నంలో మహిళను దారుణంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పరారైన నిందితుణ్ని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.
హత్య కేసును ఛేదించిన విశాఖ పోలీసులు
Last Updated : Oct 30, 2019, 1:24 PM IST
TAGGED:
latest crime news in vizag